“ఆర్ఎక్స్ 100” కథ ముందుగా వీరి వద్దకే వెళ్లిందట!

  • July 17, 2018 / 07:38 AM IST

నూతన నటుడు కార్తికేయ హీరోగా యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన “ఆర్ఎక్స్ 100” ఊహించని విజయం అందుకుంది. రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 2.53 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. తొలి వీకెండ్ నాటికి పదికోట్ల గ్రాస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయాన్ని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇద్దరు మాత్రం ఎందుకు ఈ కథని వద్దన్నామా? అని పశ్చాత్తాపపడుతున్నారు. వారెవరో కాదు విజయ్ దేవర కొండ, సుధీర్ బాబు. ఈ చిత్ర దర్శకుడు అజ‌య్ భూప‌తి కథని రాసుకోగానే.. మొదటగా విజయ్ దేవరకొండకి వినిపించారు. అప్పటికీ విజయ్ పెళ్లిచూపులు సినిమా రాలేదు.

అతనికి క్రేజ్ రాకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అజ‌య్‌భూప‌తి దాదాపు మూడు నెలల పాటు సుధీర్ బాబు కోసం తిరిగాడ‌ట‌. కానీ సుధీర్ బాబు ఈ సినిమా చేయటానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దాంతో చేసేది లేక నూతన నటుడు కార్తికేయ దగ్గరికి వెళ్లారు. అతను కథని ఓన్ చేసుకొని కష్టపడి నటించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కథని విజయ్, సుధీర్ చేసి ఉంటే వారి కెరీర్ కి ప్లస్ అయ్యేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కలక్షన్స్ కూడా భారీగా వచ్చేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus