Actress: వీళ్ల లవ్ ఎఫైర్ తెలిసి హీరో ఇంట్లో కూడా గొడవ అయిందా..!

చైల్డ్ ఆర్టిస్టుగా డజన్ దాకా సినిమాల్లో నటించింది హీరోయిన్ శ్రీదివ్య. తర్వాత తూర్పు వెళ్లే రైలు సీరియల్లో కీలకపాత్ర పోషించి బుల్లి తెర ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆ సీరియల్ తర్వాత మరికొన్నింటిలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ హీరోయిన్ గా అవకాశాలు అనుకున్నంతలో రాలేదు. దీనికి కారణం తాను తెలుగు అమ్మాయి కావడమే. తన 17ఏళ్ల వయసులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాలో అవకాశం లభించింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత రెండేళ్ల వరకు తాను వెండితెరకు దూరంగానే ఉంది.

తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక శ్రీదివ్యకు వరుసగా అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ హిట్ ప్రభావం ఏమాత్రం శ్రీదివ్య కెరీర్ కు కలిసి రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత కేరింతలో అవకాశం వచ్చి సినిమా హిట్ సాధించింది. తెలుగులో అవకాశాలు కరువవడంతో తను కోలీవుడ్ పై దృష్టి సారించింది. అక్కడ శ్రీదివ్యకి వరుస అవకాశాలు రావడంతో తను కోలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది.

అయితే ఈ మధ్య తన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. శ్రీదివ్య (Actress) ఓ పెళ్లయిన హీరోను బుట్టలో వేసుకుందని తెగ ప్రచారం జరుగుతోంది. ఆ హీరోతో ఎఫైర్ నడిపిస్తోందట. ఇక ఆ హీరో మరెవరో కాదు శివ కార్తికేయ. శ్రీ దివ్య – శివ కార్తికేయ కాంబోలో కాకి సత్తై, వరుతపడత వాలిబార్ సంగం వంటి తమిళ్ సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాలో నటించే సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందట. అది అలా అలా వారి మధ్య రిలేషన్ షిప్ గా మారిందట. కానీ అప్పటికే హీరో శివ కార్తికేయకి పెళ్లయిపోవడంతో..

వీరి మధ్య సీక్రెట్ బంధం ఉందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం హీరో భార్యకు తెలిసి ఇంట్లో గొడవలు కూడా అయ్యాయట. తర్వాతే శివ కార్తికేయ శ్రీ దివ్యను దూరంగా పెట్టాడట. అంతే కాదు వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవడంతో మరో సినిమాలో కూడా శ్రీదివ్య ను హీరోయిన్ గా దర్శక నిర్మాతలు తీసుకుంటే తానే వద్దని చెప్పేశాడట.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus