మీనా ఇంట్లో సందడి చేసిన రంభ, సంఘవి, సంగీత.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు రాణించారు మీనా. ఇక్కడి సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆమె క్రేజ్ ను పెంచుకున్నారు. ఇప్పటికీ ‘దృశ్యం'(సిరీస్) వంటి సినిమాల్లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఆమె ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. విద్యా సాగర్ బెంగళూరుకు చెందిన ఓ పెద్ద బిజినెస్ మెన్ అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. మీనా ఇంటికి సీనియర్ హీరోయిన్లు రంభ, సంఘవి, సంగీత వంటి వారు తమ ఫ్యామిలీస్ తో వెళ్లి మీనా ఇంట్లో ఫ్రెండ్ షిప్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు.

తమ క్వాలిటీ టైంని మీనా కుటుంబ సభ్యులతో గడపడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను మీనా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ‘మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీనా గారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల్లో మీనా కూతురు నైనిక కూడా ఉంది.ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus