ప్రముఖ టాలీవుడ్ నటి సీత ఎన్నో సినిమాలలో హీరోలకు తల్లి పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సక్సెస్ లను సొంతం చేసుకుంది. సీత మొదటి భర్త పేరు పార్తీపన్ కాగా కొన్నేళ్ల క్రితం వేర్వేరు కారణాల వల్ల సీత, పార్తీపన్ విడిపోయారు. సీత, పార్తీపన్ లవ్ మ్యారేజ్ చేసుకోగా ఈ జంటకు ముగ్గురు పిల్లలు కావడం గమనార్హం. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీళ్లిద్దరూ విడిపోవడం జరిగింది.
అయితే చాలా సంవత్సరాల క్రితం విడిపోయిన వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. నటి సీతకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. పుదియపాదై అనే సినిమాలో సీత, పార్తీపన్ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే సీత, పార్తీపన్ ప్రేమలో పడ్డారు. 2001 సంవత్సరంలో సీత, పార్తీపన్ వేర్వేరు కారణాల వల్ల విడిపోయారు.
భర్త నుంచి విడిపోయిన తర్వాత సీత కొంతకాలం ఒంటరి జీవనం సాగించారు. ఆ తర్వాత సీత సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా తర్వాత రోజుల్లో సీత, సతీష్ కూడా విడిపోయారు. అయితే తాజాగా ఒక సందర్భంలో పార్తీపన్ మాట్లాడుతూ సీత అత్యాశ వల్లే తాను, సీత విడిపోయామని అన్నారు. అయితే పార్తీపన్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రావడంతో సీత కూడా ఈ వార్తల గురించి స్పందించడం గమనార్హం.
పార్తీపన్ చేసిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదని నా భర్త నాకే సొంతమని ఆశించడం తప్పు ఎలా అవుతుందని ఆమె పేర్కొన్నారు. సీత చేసిన కామెంట్లలో తప్పేం లేదని నెటిజన్లు చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే సీతకు కొంతమేర ఆఫర్లు తగ్గాయి. సీత మళ్లీ వరుస మూవీ ఆఫర్లతో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ ప్రయత్నాలలో ఆమె ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.