శరీరం కాలిపోయి మంటల్లో చిక్కుకున్న నటికి ఆసుపత్రిలో చికిత్స..!

  • February 2, 2023 / 03:26 PM IST

వరుస ప్రమాదాలు, మరణ వార్తలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని సినీ ప్రముఖులు కంగారు పడుతున్నారు. అభిమానులు కూడా షాకింగ్ న్యూస్ తమను కలచి వేస్తుందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ బాధను తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటులకు ఏదైనా జరిగితే తట్టుకోవడం తమ వల్ల కాదంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. సీనియర్ నటి జమున మరణవార్త మరచిపోకముందే.. సీనియర్ దర్శకులు సాగర్ మృతి చెందారనే వార్తతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది.

ఇప్పుడు ఓ పాపులర్ నటి షూటింగ్‌కి సిద్ధమవుతుండగా ఆమె మేకప్ రూంలో పేలుడు సంభవించిన ఘటన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశీ నటి షర్మీన్‌ అకీ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నటిస్తున్న ఓ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ జరుగుతోంది. ఆమె మీర్‌పుర్‌లో షూటింగ్‌లో ఉండగా.. మేకప్‌ రూములో పేలుడు సంభవించింది. దీంతో సెట్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే షర్మీన్ మంటల్లో చిక్కుకుంది.

దీంతో ఆమె కాళ్లు, చేతులు, వెంట్రుకలతో పాటు ఇతర భాగాలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమెను షేక్‌ హసీనా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ ఆసుపత్రికి తరలించారు. షర్మీన్‌ శరీరం 35 శాతం కాలిపోయినట్లు ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు స్పందించడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను హై డిపెండెన్సీ యూనిట్‌లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

ఆమె శరీరంలో ప్లాస్మా శాతం తగ్గిపోవటంతో ప్లాస్మా ఎక్కించామన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. 27 ఏళ్ల షర్మీన్‌ బంగ్లాదేశ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటి. ‘సిన్సియర్లీ యువర్స్‌, ఢాఖా, బైషే శ్రబాన్‌, బందిని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షర్మీన్‌ బుల్లితెరలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు పోస్టులు చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus