చాలా ఏళ్లుగా నేను కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నాను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!

సమంత మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుండి ఆమె ఈ వ్యాధితో బాధపడుతుంది. దీని వల్ల ఆమె ఎక్కువ సేపు నిలబడలేదు. కీళ్ళ నొప్పులు, అధిక తలనొప్పి, కళ్ళు కూడా నొప్పి పెట్టడం, నడుం నొప్పి వంటి లక్షణాలు దీనివల్ల నిత్యం కలుగుతాయట. మరీ ప్రాణాలు తీసే వ్యాధి అయితే కాదు కానీ.. చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది అని తెలుస్తుంది. దీనికి ఆమె చాలా కాలం నుండి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అందువల్ల సినిమాలకి కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

ఆమె మొహంలో కూడా గ్లో పోయిన సంగతి తెలిసిందే. ఇక సమంతలానే మరో హీరోయిన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె మరెవరో కాదు వనిత విజయ్ కుమార్. ‘దేవి’ సినిమాలో నటించిన ఈమె అందరికీ సుపరిచితమే. ఇటీవల ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ..” సమంతలానే నేను కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు. నా స్నేహితులకి కూడా తెలీదు.నేను చాలా ఏళ్ల నుండి క్లాస్ట్రోఫోబియాతో బాధపడుతున్నాను.

దీని వల్ల చిన్న చిన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండాలంటే భయమేస్తూ ఉంటుంది. లిఫ్ట్‌, వాష్‌రూమ్‌ వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో నేను ఎక్కువ సేపు ఉండలేను. కిటికీలు లేని గదుల్లో, జన సమూహాల్లో నాకు ఊపిరాడనట్లు ఉంటుంది. దీని నుండి బయటపడటానికి అనేక విధాలుగా ట్రై చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus