ఆ కారణంతో ఎవరు ఇల్లు అద్దెకివ్వడం లేదు

హిందీ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ఉర్ఫీ జావేద్. ఇలా బిగ్ బాస్ ద్వారా ఈమె బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన వస్త్రధారణతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఎంతో విభిన్నమైన వస్త్రధారణలో ఈమె తరచూ హల్చల్ చేస్తుంటారు.కొన్నిసార్లు అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ రోడ్లపై కూడా ఈమె తిరగడంతో కొందరు ఈమె వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా నటి ఉర్ఫీ జావిద్ వస్త్రధారణ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా వస్త్రధారణతో పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా తాను ఇంటి కోసం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. తనకు ముంబైలో అద్దెకు ఉండడానికి ఫ్లాట్ దొరకడం లేదంటూ ఆవేదన చెందారు. తాను ఒక ముస్లిం అవడంతో హిందువులు ఇల్లు అద్దెకు ఇవ్వనని చెబుతున్నారని

అలాగే తన వస్త్రధారణ కారణంగా ముస్లిం వ్యక్తులు కూడా తనకు ఇల్లు అద్దెకు ఇవ్వమని చెబుతున్నారని ట్విట్టర్ వేదికగా తన ఆవేదన తెలియజేశారు. మరికొందరైతే తనకు రాజకీయ నాయకుల నుంచి వస్తున్న బెదిరింపుల కారణంగా భయపడి తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారనీ ఈమె చెప్పకువచ్చారు. ఇలా ముంబై మహానగరంలో తనకు అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది అంటూ తన ఆవేదన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో

ఒక నెటిజన్ ఈ ట్వీట్ పై స్పందిస్తూ గత కొంతకాలంగా తన పరిస్థితి కూడా అలాగే ఉందని అయితే త్వరలోనే మీకు మంచి ఇల్లు దొరకాలని కోరుకుంటున్నా అంటూ రీ ట్వీట్ చేశారు. సదరు నెటిజన్ చేసిన ట్వీట్ కు ఉర్ఫీ రిప్లై ఇస్తూ నాలాంటి ముస్లిం, సింగిల్ కు ఇల్లు దొరకడం కష్టంగా మారుతుందంటూ ట్వీట్ చేశారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus