సబ్జెట్ డిమాండ్ చేస్తే ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు హద్దులు పెట్టుకోను అని మన హీరోయిన్లు అప్పుడప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. కానీ.. “నా ఇష్టం వచ్చినట్లు ఎక్స్ పోజ్ చేస్తాను అడగడానికి నువ్వు ఎవరు?” అని స్టేట్ మెంట్ ఇచ్చిన హీరోయిన్ని ఎప్పుడైనా చూసారా?. చూడకుంటే ఇప్పుడు చూడాల్సిన సమయం వచ్చింది. మలయాళంలో “జోసెఫ్” అనే సినిమాలో నటించిన మాధురి బ్రగాంజా అనే హాట్ యాక్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పట్లానే కొన్ని హాట్ & హాటెస్ట్ ఫోటోస్ అప్లోడ్ చేసింది.
ఆ ఫోటోలకు కామెంట్స్ గా కొందరు “ఏంటీ ఈ ఎక్స్ పోజింగ్?, ఇలా చేయడం ఎందుకు?” అని పోస్ట్ చేశారు. దానికి సమాధానంగా మాధురి ఇమ్మీడియట్ గా.. “నేను ఏం ఎక్స్ పోజ్ చేయాలి, ఎలా ఎక్స్ పోజ్ చేయాలి అనేది నాకు తెలుసు.. నా ఇష్టం వచ్చినట్లు ఎక్స్ పోజ్ చేస్తాను, అడగడానికి నువ్వెవరు, నీకేంటి సమస్య?” అని రిప్లై ఇవ్వడమే కాక ఇన్ స్టా స్టోరీస్ కూడా పోస్ట్ చేసింది. దాంతో ఈ వార్త నేషనల్ మీడియా దాకా వెళ్లింది. దాంతో మాధురీ బ్రగాంజా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.