రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రముఖ నటి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కరిష్మా కపూర్ అందరికీ సుపరిచితమే. కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఈమె చెల్లెలు, సైఫ్ అలీ ఖాన్ భార్య అయిన కరీనా కపూర్ తో కలిసి కరిష్మా చేసే అల్లరిని మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరోపక్క ఆమె తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ తన ఫాలోవర్లను నిద్ర లేకుండా చేస్తుంటుంది.

ఇదిలా ఉండగా… 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్ల పాటు అతనితో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. కాకపోతే తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2016 లో విడాకులు తీసుకొని సెపరేట్ అయిపోయిన ఈ జంట స్నేహితులుగా కలిసుంటున్నట్టు మొన్నామధ్య కరిష్మా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటిదాకా కరిష్మా ఒంటరిగానే జీవనం కొనసాగిస్తూ వచ్చింది.

ఇక త్వరలో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.కొత్త లైఫ్ ను మొదలుపెట్టాలి అనే ఉద్దేశంతో కరిష్మా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానిలతో చిట్ చాట్ సెషన్ నిర్వహించిన తరుణంలో ఓ నెటిజెన్ ” మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారా?” అంటూ ప్రశ్నించాడు.ఇందుకు ఆమె ‘చేసుకొంటానేమో’ అంటూ సమాధానం ఇచ్చింది.

దీంతో ఈమె రెండో పెళ్లి పై వస్తున్న వార్తలు నిజమే అంటూ ఈ టాపిక్ మరింత వైరల్ అవుతుంది. మరి కరిష్మా ఏ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లాడుతుందో చూడాలి.ప్రస్తుతం ఈమె వయసు 47 ఏళ్ళు అన్న సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus