ఏదైనా చిన్నపాటి వివాదం జరిగితే దాన్ని కోర్టు మెట్లు ఎక్కే వరకు తెచ్చుకోకుండా పరిష్కరించుకోవాలి.. కాదని కోర్టుకెక్కితే వాయిదాల మీద వాయిదాలతో జీవిత కాలం కోర్టుల చుట్టూ తిరగాలి అంటుంటారు.. ఇతరత్రా కేసుల్లో కోర్టులు ఇప్పటివరకు పలు సంచలన తీర్పులు ఇవ్వడం విన్నాం.. చూశాం.. చదివాం.. ఇప్పుడలాంటి సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు.. అది కూడా ఓ పాపులర్ నటి విషయంలో.. వివరాల్లోకి వెళ్తే.. అభినయ కన్నడలో పాపులర్ నటి.. 1971లో పుట్టిన ఆమె 1984లో తన 13వ ఏట కాశీ విశ్వనాథ్ ‘అనుభవ’ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది..
కన్నడలో కాశీ రొమాంటిక్ చిత్రాలకు పెట్టింది పేరు.. ఆమె తర్వాత అలాంటి సినిమాల్లో హీరోయిన్‌గా, పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.. 2019 తర్వాత పూర్తిగా సీరియల్స్‌కే పరిమితమైంది. ఈమె తన సోదరుడి విషయంలో ఓ వివాదంలో ఇరుక్కుంది.. అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవితో వివాహమైంది.. ఆ సమయంలో కట్నంగా రూ. 80 వేల నగదు, 250 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే అభినయ కుటుంబం మరో లక్ష రూపాయల అదనపు కట్నం తీసుకురమ్మని తనను వేధిస్తున్నారంటూ.. 2002లో లక్ష్మీదేవి బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.
తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు అభినయతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. పలు వాయిదాల అనంతరం 2012లో మెజిస్ట్రేట్ కోర్టు ఐదుగురు నిందితులకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.. కానీ జిల్లా కోర్టు దీనిపై స్టే విధించింది. ఈ క్రమంలోనే లక్ష్మీ దేవి.. జిల్లా కోర్టు తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు వేసింది. ఇన్నాళ్లూ కేసు నడుస్తూనే ఉంది..
కొద్దికాలం క్రితం అభినయ సోదరుడు శ్రీనివాస్, తండ్రి రామకృష్ణ చనిపోయారు. తాజాగా ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. కట్నం వేధింపుల కేసులో నటి అభినయతో పాటు ఆమె తల్లి జయమ్మ, సోదరుడు చెలువకు తలో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో త్వరలో ఈ ముగ్గురు జైలుకు వెళ్లనున్నారు. పదేళ్ల తర్వాత కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!