జైలు అనుభవాలు గుర్తు చేసుకున్న స్టార్ హీరోయిన్ భర్త

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అందరికీ తెలుసు. గతంలో ఆయనకు శిల్పా శెట్టి భర్త అనే ట్యాగ్ ఉండేది. కానీ తర్వాత అస్లీల చిత్రాల సృష్టికర్తగా ఆయన పేరు మార్మోగింది. దీంతో ఆయన ఎక్కువగా మాస్కులు ధరించి బయట తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల ఈయనకి మాస్క్ మెన్ అనే పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆయన నార్మల్ గానే తిరుగుతున్నారు అనుకోండి. ఇదిలా ఉండగా.. నీలి చిత్రాల కేసులో ఈయన జైలుకు వెళ్లి రావడం కూడా జరిగింది.

అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల ఆయన నటించిన ‘UT69 ‘ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన జైలు అనుభవాలను చెప్పుకొచ్చారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. “జైల్లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాను. జైల్లో అడుగుపెట్టిన మొదటిరోజే నా బట్టలు తీయించేసి నగ్నంగా నిలబెట్టారు. అందరి ముందు నేను నగ్నంగా నిలుచున్నాను. ఆ తర్వాత ఏమైనా తేకూడని పదార్థాలు తెచ్చావా? అంటూ ప్రశ్నించారు.

తర్వాత నన్ను వంగోమని చెప్పి వెనుకవైపు చెక్ చేయడం కూడా జరిగింది.ఆ టైంలో నాకు ప్రాణం పోయినట్టు అయ్యింది. ఇన్నాళ్లు నేను సంపాదించుకున్న పరువు, ప్రతిష్ట అన్నీ మట్టిలో కలిసిపోయాయి అనే దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ సమయంలో నాకు బతికున్నా కూడా చనిపోయాననే భావన ఎక్కువగా కలిగింది” అంటూ రాజ్ కుంద్రా (Raj Kundra) చెప్పుకొచ్చాడు. ఇక ‘UT69 ‘ సినిమా నవంబర్ 3 న రిలీజ్ కానుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus