సినీ పరిశ్రమలో నటీనటులకు అవకాశాలు కనుక తగ్గితే.. వారిపై ఆర్థికంగా చాలా భారం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చినా.. అందులో 40 శాతం వరకు మెయింటెనెన్స్ కి పోతుంది. ఇలాంటి టైంలో అవకాశాలు తగ్గి.. అడ్వాన్స్ లు కనుక లేకపోతే.. ఇంతకు ముందు చెప్పుకున్నదే నిజమవుతుంది. ఇక మొత్తానికే అవకాశాలు తగ్గితే ఇక వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఇప్పుడు ఓ హీరోయిన్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది.
ఆమె మరెవరో కాదు అరుంధతి నాయర్. మొన్నామధ్య ఈమె యాక్సిడెంట్ పాలయ్యింది. దీంతో ఈమెను కేరళలోని తిరువనంతపురంలోని ఓ హాస్పిటల్లో చేర్పించారు స్థానికులు. ఆమె తన సోదరుడితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.యాక్సిడెంట్ జరగడం వల్ల వీళ్ళకి చాలా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అరుంధతి వెంటిలేటర్‌పై ఉంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు ఆమె వద్ద లేవట.
ఈ విషయం ఆమె స్నేహితురాలు, నటి అయిన గోపిక అనిల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అలాగే ఫోన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కూడా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.ఇక అరుంధతి నాయర్ 2014 తమిళంలో వచ్చిన ‘పొంగి ఎలు మనోహర’ చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత ‘సవిరుమాండికుమ్ శివానందికమ్’, ‘సైతాన్’, ‘పిస్తా’, ‘ఆయిరం పోర్కాసుకల్’ వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?