అవమానాలు ఎదుర్కొన్న ముందడుగు వేయాలి: నటి

మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అయితే ఈమె నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనంతరం నాగచైతన్య సరసన మరొక సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. అక్కడ మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కృతి సనన్ తాజాగా నేషనల్ అవార్డుకు కూడా ఎంపిక అయ్యారు.

ఇలా నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఈమె (Kriti Sanon) ఇంత మంచి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని ఈ పేరు ప్రఖ్యాతలు తనకు అంత సులువుగా రాలేదు అంటూ తెలియజేశారు అదేవిధంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అందుకోవాలి అంటే కొన్నిసార్లు అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈమె తెలియజేశారు.

ఇలా అవమానపడ్డామని అక్కడితో ఆగిపోతే ఎవరూ కూడా ఈ స్థాయికి చేరుకోలేరని ఆ అవమానాలనే గుణ పాఠాలుగా చేసుకొని ముందడుగు వేయాలని తెలిపారు. ఇక తను కూడా ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు. ఒక సారి హై హీల్స్ వేసుకుని బురదలో డ్యాన్స్ చేయలేకపోయినప్పుడు కో ఆర్డినేటర్‌ అందరి ముందు చెడామడా తిట్టారని అక్కడ నా తప్పు లేకపోయినా మాటలు పడాలని తెలియజేశారు.

మోడలింగ్ చేసే సమయంలో కూడా తనకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి అయితే ఎవరో ఏదో అన్నారని మనం అక్కడే ఆగిపోకూడదని ఈమె ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లకి సలహాలు ఇచ్చారు. ఇక ఈమె చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus