నడవలేని స్థితిలో పాపులర్ హీరోయిన్!.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానంటూ ఓ పాపులర్ హీరోయిన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.. ఆ కథానాయిక ఎవరంటే.. రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’ హీరోయిన్ కనిక (కనిహా – Kaniha).. ‘ఫైవ్ స్టార్’ అనే తమిళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మలయాళీ భామ శ్రీకాంత్ ‘ఒట్టేసి చెప్తున్నా’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. కన్నడలో ఓ మూవీ, తమిళంలో కొన్ని చిత్రాలు చేసింది. మళయాళంలోనే ఎక్కువగా యాక్ట్ చేసింది.

తమిళనాడుకి చెందిన కనిహా అసలు పేరు దివ్య వెంకటసుబ్రమణియన్.. 2008లో శ్యామ్ రాధాకృష్ణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఎక్కువగా మలయాళంలో నటిస్తున్న కనిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫెషన్, పర్సనల్ అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తన కుడి కాలు ఫ్రాక్చర్ అయినట్టు ఓ పిక్ షేర్ చేసింది.. వాకర్ పట్టుకుని, ఫ్రాక్చర్ అయిన కాలుకి పట్టీ వేసుకుని ఉందామె..

‘యాంకిల్ ఫ్రాక్చర్ కారణంగా నడవలేకపోతున్నా.. వాకర్ సాయంతో బ్యాలెన్సింగ్‌గా అడుగులెయ్యడం నేర్చుకుంటున్నా’ అంటూ కనిహా పోస్ట్ చేసిన ఫోటో చూసి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus