Star Actress: పేరులో ఉన్న జయం ఆమె జీవితంలో లేదు..అసలు ఏమి జరిగిందంటే!

అందానికే అసూయ పుట్టే అందం , అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జయప్రద. భూమి కోసం చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన తార. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో కనువిందు చేసిన సొగసరి. తన అందానికి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా నటించారు. ఆమె 13 సంవత్సరాల చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా లో కూడా పెద్ద హీరోలైన అమితాబచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి వారితో నటించి సంచలనం సృష్టించింది.

బాలీవుడ్ సినీ జనాలతో పాటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఆమె అందచందాలకు ఫిదా అయిపోయారు. జయప్రద అందం కోసం నార్త్ ఇండియన్ సినీ జనాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన జయప్రద వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను చేసిన తప్పుతో పాతాళంలోకి వెళ్లిపోయింది. బాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఉన్న సునీల్ త‌న కుమారుడు శ్రీకాంత్ నహ‌తాను ఆమె ప్రేమించింది. అప్పటికే శ్రీకాంత్ కు పెళ్లి అయ్యి.. పిల్లలు కూడా ఉన్నారుట.

అతనితో నీకు ప్రేమ దోమ వద్దు.. మంచి లైఫ్ ఉంది అని ఎంతోమంది చెప్పినా (Actress) జయప్రద వినలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు చూపించిన కపట ప్రేమకు లొంగిపోయింది. అతడిని పెళ్లి చేసుకుంది. ఎంత దారుణం అంటే ?పెళ్లి అయిన వారానికే అతడి నిజ స్వరూపం ఆమెకు తెలిసి వచ్చిందట. కేవలం తనను వాడుకునేందుకు మాత్రమే అతడు పెళ్లి చేసుకున్నాడని.. మొదటి భార్య కండిషన్ మేరకు పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడ‌న్న విషయం జయప్రదకు తెలిసిందట. దీంతో ఆమె గుండె బద్దలైంది. భర్త చేసిన మోసం తట్టుకోలేకపోయింది.

చాలా ఏళ్లపాటు తనలో తానే బాధపడుతూ కృంగిపోయింది. చాలా రోజులు పాటు భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తూ వచ్చిన్నట్లు సమాచారం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళింది. చివరకు భర్త సినిమా వాళ్ళతోను.. రాజకీయ నేతలతో తనకు ఎఫైర్లు అంటగట్టటం ప్రారంభించాడట. ఈ బాధలు తట్టుకోలేక ఆమె విడాకులు ఇచ్చేసి అతడికి దూరమైందని అప్పట్లో వార్తలు వచ్చేవి. ఆమె పేరులో ఉన్న జయం ఆమె జీవితంలో లేదని కొందరూ అనేవారు. ఆ తర్వాత తనకంటూ ఒక జీవితం ఏర్పరచుకుని ముందుకు వెళుతుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus