పెద్ద ప్రమాదం నుండీ బయటపడ్డ బాలయ్య హీరోయిన్…!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం కలకలం సృష్టించింది. ఆమె నిన్న ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఆమె కారుకి ఉన్న బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.అయితే అదృష్టవశాత్తు ఘోర ప్రమాదం ఏమీ జరగలేదు. స్వల్ప గాయాలతో తనుశ్రీ దత్తా తప్పించుకుంది. ఆమె కాలికి గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారట.

ఇక యాక్సిడెంట్ విషయాన్ని స్వయంగా తనుశ్రీ దత్తానే చెప్పుకొచ్చింది. ‘ఈ రోజు నా జీవితంలో ఓ అడ్వెంచరస్ డే అనే చెప్పాలి. గుడికి వెళ్తున్న సమయంలో నా కారు యాక్సిడెంట్ కు గురయ్యింది.నా కాలికి కుట్లు పడ్డాయి. ఏది ఏమైనా దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌’ అంటూ పేర్కొంది. తనుశ్రీ దత్తా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’ మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ‘మీటూ’ ఇష్యూతో ఈమె దేశం మొత్తం పాపులర్ అయ్యింది.

బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ఈమెను లైంగికంగా వేధించాడు అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఈమె బాటలో ఎంతో మంది నటీనటులు మీడియా వేదికగా వారిని వేధించిన దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లను బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఈమె సినిమాలకి దూరమై 12 ఏళ్ళు కావస్తోంది.ఈమె చివరిగా నటించిన మూవీ అపార్ట్మెంట్ 2010 లో విడుదలైంది. ఈమె రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు అక్కడి దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు

కానీ ఈమెకి మాత్రం మళ్ళీ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని తెలిపింది. మరి మనసు మార్చుకుని ఏమైనా నటిస్తుందా లేక ఇలాగే అంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గరగా ఉంటుందా అన్నది చూడాలి..!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus