భర్తతో విడాకులు.. స్పందించిన నటి!

టాలీవుడ్ లో ‘బుజ్జిగాడు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి సంజనా గల్రానీ. అయితే గత కొన్నాళ్లుగా ఈమె పలు విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆమెపై ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చాలా రోజులు జైల్లోనే ఉన్న ఈ బ్యూటీ 2020 డిసెంబర్ లో బెయిల్ పై బయటకొచ్చింది. అలా వచ్చిన వెంటనే తన చిన్నప్పటి స్నేహితుడు, డాక్టరో పాషాను వివాహంచేసుకుంది .

పెళ్లి తరువాత ఆమె సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటోంది. రీసెంట్ గా ఈమె ప్రెగ్నెంట్‌ అంటూ కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా సంజనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంజనకు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయని.. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరిగింది. ఈ విషయం సంజన వరకు వెళ్లింది. దీంతో వెంటనే ఆమె స్పందించింది.

తమన్నా వైవాహిక జీవితం చాలా బాగుందని.. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. అంతేకాదు.. ఆధారాలు లేని వార్తలు సృష్టించొద్దని చెప్పింది. ఇలాంటి తప్పు వార్తలు ప్రచారం చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రెండు, మూడు సినిమాలు చేసింది. ఏవీ ఆమె కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. దీంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. సెలూన్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus