బుల్లితెర పరిశ్రమలో విషాదం.. వేర్వేరు వ్యాధులతో నటీమణుల మృతి!

హిందీ బుల్లితెర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అమన్ దీప్ సోహీ, డాలీ సోహీ కొన్ని గంటల గ్యాప్ లో మృతి చెందడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అమన్ దీప్ సోహీ జాండీస్ తో మృతి చెందగా డాలీ సోహీ సర్వైవల్ క్యాన్సర్ వల్ల కన్నుమూశారు. అమన్ దీప్ సోహీ, డాలీ సోహీ మృతితో ఈ నటీమణుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమన్ దీప్ సోహీ నిన్న మరణించగా డాలీ సోహీ ఈరోజు తెల్లవారుజామున మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈరోజు మధ్యాహ్నం అంతక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం అందుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటీమణులు మరణించడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా అమన్ దీప్ సోహీ, డాలీ సోహీలకు సంతాపం తెలియజేస్తున్నారు. వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఝనక్, పరిణీతి టీవీ ప్రోగ్రామ్స్ డాలీ సోహీని అభిమానులకు దగ్గర చేశాయి. గతేడాది డాలీకి గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ ఏడాది ప్రారంభంలో డాలీ శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడినట్టు తెలుస్తోంది. డాలీ సోహీ క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి కీమోథెరపీ కూడా చేయించుకున్నారని సమాచారం అందుతోంది. డాలీ సోహీకి ఒక కూతురు ఉంది.

సోదరి మరణ వార్త విని తట్టుకోలేక (Dolly Sohi) డాలీ సోహీ మృతి చెందారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ నటీమణుల కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కామెంట్లు చేస్తున్నారు. అమన్ దీప్ సోహీ, డాలీ సోహీల మరణ వార్త తమను ఎంతగానో బాధ పెడుతోందని ఇద్దరికీ ఇతరులకు సహాయం చేసే మంచి గుణం ఉందని సన్నిహితులు, బంధువులు వెల్లడిస్తున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus