సినిమా హిట్ అయితే దర్శకులకి ఖరీదైన కార్లు గిఫ్ట్..లు ఇచ్చి సత్కరిస్తున్న రోజులు ఇవి. దర్శకుడికి ఆ గిఫ్ట్ హీరో నుండి అయినా రావచ్చు, నిర్మాత నుండి అయినా రావచ్చు. ఈ లిస్టు చెప్పుకోవడానికి చాలా పెద్దదే. ‘శ్రీమంతుడు’ సినిమా హిట్ అయితే హీరో మహేష్ బాబు.. దర్శకుడు కొరటాల శివకి ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ‘విక్రమ్’ సూపర్ హిట్ అయినప్పుడు కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ కి కారు గిఫ్ట్ గా ఇచ్చారు.
నిన్ననే పవన్ కళ్యాణ్.. తనకు ‘ఓజి’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సుజిత్..కి ఓ ఖరీదైన కారుని బహుకరించారు. ఈ న్యూస్ ఇంకా ట్రెండింగ్లో ఉండగానే.. మరో దర్శకుడు కూడా ఖరీదైన గిఫ్ట్ అందుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే.. ఈసారి గిఫ్ట్ అందుకున్న దర్శకుడి సినిమా ఇంకా రిలీజ్ అయ్యింది లేదు. ఎవరా దర్శకుడు? ఏంటా సినిమా? ఏంటి దీని కథ? ఇప్పుడు తెలుసుకుందాం రండి.!
2026 సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి ఇందులో హీరో. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ను నిర్మాత నాగవంశీ చూశాడట. దాంతోనే సినిమా హిట్ అని అతను డిసైడ్ అయిపోయాడట. కచ్చితంగా హిట్ అవుతుందని సెకండాఫ్ రషెస్ కూడా చూశాడట. అది కూడా నచ్చిందట.
వెంటనే దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట. అలాగే తన బ్యానర్లో మరో సినిమా చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే మారికి నాగవంశీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.