Actress: భర్త బలవంతం చేయడం వల్లే ఆ హీరోతో సినిమాకు ఓకే చెప్పిందా..!

సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు లేకుండా ఉండవు. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈమెకి ఉన్న క్రేజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ మరొకరు లేరు అనడం లో ఎలాంటి సందేహం. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కాజల్ అగర్వాల్ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

అలా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఆమెకి ‘చందమామ’ చిత్రం మొట్టమొదటి హిట్ గా నిల్చింది. ఆ సినిమా తర్వాత ‘మగధీర’ చిత్రం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో మన అందరం చూసాం. ఈ చిత్రం తర్వాత ఆమె సౌత్ లో అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ సమయం లోనే నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గౌతమ్ అనే అతన్ని పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషించాలని అనుకుంది. కానీ భర్త గౌతమ్ హీరోయిన్ పాత్రలు కూడా చెయ్యమని చెప్పాడట. ఆ సమయం లోనే బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం లో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ముందుగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

కానీ భర్త గౌతమ్ మాత్రం చాలా ఒత్తిడి పెట్టి ఈ పాత్రని చేయించాడట. తన వల్ల (Actress) కాజల్ అగర్వాల్ కెరీర్ ఇబ్బంది పడకూడదు, ఇంతకు ముందు ఆమె కెరీర్ ఎలా అయితే ఉండేదో, అలాగే ఇప్పుడు కూడా ఉండాలి అనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం కాజల్ అగర్వాల్ అదృష్టం అనే చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus