ఆదిపురుష్ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతున్నప్పటికీ రోజూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. మొదట పోస్టర్స్ తో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ట్రైలర్, పాటలు, రిలీజ్ ట్రైలర్.. వంటి వాటితో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అనుకుంటే.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున దర్శకుడు ఓం రౌత్ – కృతి సనన్ ల ముద్దు, హగ్గు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. అతని పై కేసు కూడా నమోదైంది.
చివరికి ఇది రిజల్ట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అర్ధం కావడం లేదు.ఇదిలా ఉండగా..ఓ సీనియర్ నటి కృతి సనన్ పై మండిపడుతూ ఓ రేంజ్లో విమర్శలు గుప్పించింది. 90 వ దశకంలో దేశం మొత్తం విశేషాదరణ పొందిన రామానంద్ సాగర్… ‘రామాయణం’ సీరియల్లో దీపికా చిఖిల అనే నటి సీతగా అద్భుతంగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. తాజాగా ఆమె ఓం రౌత్ .. కృతి సనన్ ల హగ్గులు, ముద్దుల వ్యవహారం పై స్పందించింది.
ఆమె (Kriti Sanon) మాట్లాడుతూ.. ” ఇప్పటి జెనరేషన్ నటీనటులతో ఇదే పెద్ద ప్రాబ్లమ్. వాళ్ళకి తాము ఎలాంటి పాత్రలో నటిస్తున్నాం అనే కనీస ఇంగితం ఉండదు. సీత లాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఎంతలా లీనం అయిపోవాలి అనేది కూడా వీళ్ళకి తెలియట్లేదు. అలాంటి వాళ్ళు సీత పాత్రలో నటిస్తే దానిని వాళ్ళు కేవలం ఒక పాత్రగా మాత్రమే భావిస్తున్నారు.
రామాయణాన్ని జస్ట్ ఒక మూవీగా మాత్రమే చూస్తున్నారు.అలాంటి గొప్ప పాత్ర పై వారికి ఎలాంటి ఎమోషన్ ఉండదు. షూటింగ్ అయిపోగానే ఒక ప్రాజెక్టు అయిపోయింది అనుకుంటారు అంతే.! కృతి కూడా ఈ జనరేషన్ నటి కాబట్టి అలాగే ప్రవర్తిస్తుంది. కిస్సులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం మాత్రమే ఇప్పటి రోజుల్లో మంచి సంస్కృతి అని అనుకుంటున్నారు. కృతి సనన్ ‘ఆదిపురుష్’ చిత్రంలో సీతగా నటించింది అంతే..! తనని తాను సీతగా అయితే భావించుకోవడం లేదు.
మా రోజుల్లో అలా కాదు. నేను కూడా సీత పాత్రలో నటించాను కదా. నేను ఆ పాత్రలో జీవించాను. కనీసం సెట్లో కూడా మమ్మల్ని ఎవ్వరూ కూడా పేరు పెట్టి పిలిచేవారు కాదు. నిజమైన దేవుళ్ళ లానే మమ్మల్ని ట్రీట్ చేసేవారు” అంటూ దీపికా చిఖిల చెప్పుకొచ్చింది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు