ముంబై ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపేశారు

సినిమా సెలబ్రిటీలు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా చూస్తారు కానీ.. ఎంత పెద్ద సెలబ్రిటీని కూడా మామూలు మనిషిలా ట్రీట్ చేసే ఒకే ఒక్క ప్లేస్ ఎయిర్ పోర్ట్. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో/హీరోయిన్ వరకూ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు ఎయిర్ పోర్ట్ స్టాఫ్. కాకపోతే.. ఇటీవల ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఏకంగా ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్, బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలు చేసిన ప్రీతీ జింటా. అయితే.. ఆమెను ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆపడానికి కారణం సెక్యూరిటీ రీజన్స్ మాత్రం కాదు.

ప్రీతీ జింటా ఎక్స్ బోయ్ ఫ్రెండ్ నెస్ వాడియా “గో ఎయిర్” ఫ్లైట్స్ కి ఎం.డి. ఆరోజు రాత్రి ప్రీతిజింటా తన సంస్థకు చెందిన విమానంలో ప్రయాణం చేయనుందని తెలుసుకొని ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా చేసి.. దాదాపు ముడునాలుగు గంటలపాటు ప్రీతి జింటా ఎయిర్ పోర్ట్ లోనే ఉండేలాగా చేశాడు. ఏమీ చేయలేని స్థితిలో వేరే ఫ్లైట్ సెట్ అయ్యేవరకూ ఎయిర్ పోర్ట్ లోనే మిన్నకుండిపోయింది ప్రీతి జింటా. బహుశా తనపై వేసిన హెరాస్ మెంట్ కేసుకు ప్రతీకారంగా నెస్ వాడియా ఇలా చేసి ఉంటాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus