Actress: విలన్ గా ఆ హీరోయిన్ ను చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..!

సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. తెలుగు ప్రేక్షకులంతా ముద్దుగా స్వీటీగా పిలుచుకునే ఈ భామ కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయింది. అరుంధతి సినిమాతో తాను గ్లామర్ పాత్రలేకాదు ఫర్ఫార్మెంట్స్ ఉన్న పాత్రలను కూడా చేయగలనని నిరూపించుకుంది. ఆ సినిమాతో తనలోని నట విశ్వరూపం చూపించి జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇటీవల కాలంలో అనుష్క పెద్దగా సినిమాల్లో నటించలేదు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఫర్వాలేదనిపించుకుంది.

తాజాగా తన 18ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళం మినహా భాషల వైపు కన్నెత్తి చూడలేదు. సింగం సిరీస్ సినిమాలతో బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించింది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్నప్పుడు కూడా మలయాళం నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన చేయనని చెప్పింది . కానీ ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చకుని తొలిసారి ఓ మ‌ల‌యాళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కథానార్ పేరుతో ఓ సూపర్ నాచురల్ హారర్ మూవీ చేయబోతోంది. య‌థార్థ ఘ‌ట‌న కథాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ హారర్ మూవీ లో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాదర్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో అనుష్క క్యారెక్టర్ అరుంధతి రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

మొత్తం పదిహేను భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. క‌థానార్ మూవీ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. హార‌ర్ అంశాల‌తో సాగిన ఈ వీడియో గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియో గ్లింప్స్ ద్వారా అనుష్క ఈ మూవీలో న‌టించ‌నున్న విష‌యాన్ని రివీల్ చేశారు. క‌థానార్‌ను ఫ్రాంచైజ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2024 లో విడుదల కానుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus