నటి హత్య విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?

సినీ పరిశ్రమలో వరుస ప్రమాదాలు, మరణాలు సంభిస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల మృతిచెందారు. ‘కె.జి.ఎఫ్’ తాతగా పాపులర్ అయిన సీనియర్ నటుడు కృష్ణ జి రావు, తమిళ నటుడు శివ నారాయణ మూర్తి.. మనోజ్ బాజ్‌పాయ్ తల్లి గీతా దేవి వంటి వారు కన్నుమూశారు.. ఇప్పుడు మరో మరణంతో పరిశ్రమ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.. ఇది మరణం అనడం కంటే దారుణం అనాల్సిన సంఘటన..

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే కడతేర్చుతున్న కసాయి బిడ్డలున్న సమాజంలో బతుకుతున్నాం.. ఆస్తులు, అంతస్తుల కోసం బంధాల్నీ, బంధుత్వాల్నీ తుంచేస్తున్నారు.. ఓపిక ఉన్నన్నాళ్లూ నటిస్తూ.. తన కష్టార్జితంతో బిడ్డల్ని ప్రయోజకులను చేసిన ఓ ప్రముఖ నటి.. తన సంపాదన కారణంగా.. ప్రేమతో పెంచిన కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు.. వివరాల్లోకి వెళ్తే.. వీణా కపూర్ ప్రముఖ నటి (74).. బాలీవుడ్‌లో సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కొడుకు అమెరికాలో సెటిలవ్వగా..

ముంబైలోని పాష్ ఏరియా అయిన జూహులో మరో కొడుకుతో కలిసి ఉంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ఆమె దారుణ హత్యకు గురయ్యారు.. వీణాను ఆమె కొడుకే హత్య చేశాడంటూ.. సహ నటి నీలూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వీణా కపూర్ పేరు మీద రూ. 12 కోట్లు విలువ చేసే ఓ ఫ్లాట్ ఉంది.. దాన్ని తన పేరు మీద రాయమని కొడుకు, తల్లిని నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో బేస్ బాల్ బ్యాట్‌తో వీణా తలపై కొట్టి అత్యంత దారుణంగా హతమార్చాడు..

మృతదేహాన్ని ఇంటికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పాతి పెట్టి వచ్చాడు..అమెరికాలో ఉంటున్న మరో కొడుకు ఎన్ని సార్లు కాల్ చేసినా తల్లి నుండి స్పందన రాకపోవడంతో.. అనుమానం వచ్చి ముంబై పోలీసులకు సమాచారమందించాడు.. పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.. ఆస్తి కోసమే తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడతను.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.. వీణా కపూర్ హత్య వార్తతో బాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus