సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు వంటి వ్యవహారాలు నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ స్టార్ హీరో మేనకోడలు రెండవ పెళ్ళి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా మేనకోడలు అయిన సోమ్య సేథ్ చిత్తార్‌ఘడ్‌కు చెందిన శుభమ్ ను రెండో పెళ్ళి చేసుకుంది. ఇతను వాషింగ్టన్ డీసీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. సోమ్య అపార్ట్‌మెంట్‌లో ఇతను రెంట్ కి ఉండేవాడు.
తర్వాత వీరిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. కోవిడ్ టైంలో మరింత దగ్గరయ్యారు. దీంతో శుభమ్ ను పెళ్లి చేసుకోవాలని సోమ్య డిసైడ్ అయ్యిందట. సోమ్యకి ఇది వరకే పెళ్లవడం మాత్రమే కాదు ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. శుభమ్ ఆమె కొడుకుని ప్రేమగా చూసుకునే పద్ధతి కూడా సోమ్య కి నచ్చేసిందట. పెద్దలతో చెప్పి, ఒప్పించి ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. జూన్ 21న హల్దీ, మెహందీ వేడుకలు, 22న పెళ్లి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.
‘నా భవిష్యత్తు బాగుండాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని నా తల్లిదండ్రులు కోరుకున్నారు. వారి కోరికను నెరవేరుస్తూనే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నా కొడుకు ఐడెన్ కి కూడా శుభమ్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లి కోసం వాడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. మా ఇద్దర్నీ పెళ్లి గెటప్‌లో చూసి మురిసిపోయాడు’ అంటూ ఈమె (Actress) తన రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!