Lenin: అఖిల్ లెనిన్‌.. రంగంలోకి మంగపతి!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni)  ప్రస్తుతం ‘లెనిన్’ (Lenin) అనే విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మొదటి గ్లింప్స్‌తోనే అంచనాలు భారీగా పెరిగాయి. “ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు” అనే ట్యాగ్‌లైన్‌ ఈ సినిమాకు ప్రత్యేకమైన టోన్‌ను ఇస్తోంది. మాస్‌, యాక్షన్‌, లవ్‌, డివోషన్ అన్ని అంశాలను కలిపి లెనిన్ చిత్రాన్ని మలుస్తున్నారు.

Lenin

గ్లింప్స్‌ చూసినవారందరికీ అఖిల్ పాత్రలో ఓ కొత్తదనం కనిపించింది. నుదిటిపై బొట్టు, పెరిగిన గడ్డం, బాడి లాంగ్వేజ్ ఇవన్నీ కలిపి అఖిల్ కెరీర్‌లో ఎప్పుడూ లేని శైలిలో ఈ పాత్ర ఉంటుందని టాక్. రాయలసీమ నేపథ్యంలోని కథలో అఖిల్ ఓ మాస్ డివోషనల్ హీరోగా కనబడబోతున్నాడు. ఇదే అఖిల్ నటనలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల లెనిన్ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ప్రముఖ నటి ఈశ్వరి రావు (Easwari Rao) ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనుండగా, ‘కోర్టు’ (Court)  చిత్రంతో మంగపతి పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శివాజీ (Sivaji)  కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. వారి పాత్రలు సినిమాకు ఇంకొంత బలాన్ని ఇస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం వరకు ఈ మూవీ షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయిందట. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మేకర్స్ ఇప్పటికే చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్‌లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా శ్రీలీల  (Sreeleela) నటిస్తోంది. ఆమె పాత్ర కూడా యాక్టివ్‌గా ఉండబోతుందట. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus