ప్రముఖ కమెడియన్ పరిస్థితి విషమం..!

ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ రాజు శ్రీవాస్త‌వ బుధ‌వారం నాడు జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. జిమ్ లో కఠినమైన వ‌ర్క‌వుట్లు చేస్తున్న టైంలో ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావ‌డంతో కుప్ప‌కూలినట్టు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్‌ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు తెలిపారు.వైద్యులు రెండు సార్లు సీపీఆర్ చేసి గుండె బాగా పని చేసేలా చేశారట. రెండు సార్లు చేయడంతో పరిస్థితి నార్మల్ అయ్యింది అని వారు చెప్పుకొచ్చారు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఆ తర్వాత అతని పరిస్థితి మరింత ఘోరంగా తయారైనట్లు వినికిడి. ఆయన మెదడు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందట. ప్రస్తుతం రాజు శ్రీవాస్తవ అపస్మారక స్థితిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందింది. గుండెపోటు సమయంలో, రాజు శ్రీవాస్తవ మెదడుకు విపరీతమైన నష్టం జరిగిందని వినికిడి. రాజు శ్రీవాస్తవ అనేక స్టాండప్ కామెడీ షోలతో పాపులర్ అయ్యాడు.

‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’, ‘కామెడీ సర్కస్’, ‘ది కపిల్ శర్మ షో’, ‘శక్తిమాన్’ వంటి టీవీ షోస్ ద్వారా అతను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘మైనే ప్యార్ కియా’, ‘తేజాబ్’, ‘బాజీగర్’ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటనతో ఇతను ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాడు.రాజు శ్రీవాస్త‌వ కోలుకోవాలని అతని కుటుంబ సభ్యులతో పాటు అతని నటనను అభిమానించే ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus