దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలు సైతం వైరస్ బారిన పడ్డారు. వారిలో కొందరు కోలుకోగా.. మరికొందరు వైరస్ కి బలయ్యారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు వైరస్ సోకి మృతి చెందారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ నటుడు పాండు(74) కరోనాకు బలయ్యారు.
1970లో ‘మానవన్’ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన పాండు.. ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ‘కర్రైల్లెం షేన్‌బాగవూ’ అనే సినిమా ఆయనకు పాపులారిటీ తీసుకొచ్చింది. కెరీర్ పరంగా హిట్టు సినిమాల్లో నటించిన ఆయన రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుకున్నారు. ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ లోగోని డిజైన్ చేసింది పాండునే. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు.
దీంతో ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన భార్యకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో హాస్పిటల్ లోనే చికిత్స అందిస్తున్నారు. పాండు మృతితో కోలీవుడ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!