సినీ పరిశ్రమలో మరో విషాదం.. చికిత్స పొందుతూ కమెడియన్ మృతి..!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. గత 3 నెలల్లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు.ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో షాక్ కు గురైన ఇండస్ట్రీ ఇంకా కోలుకోక ముందే రష్మీ జయగోపాల్, వంటి సినీ నటులు మరణించారు. తాజాగా మరో కమెడియన్ కూడా మరణించినట్టు తెలుస్తుంది.

ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ రాజు శ్రీవాస్త‌వ్ ఈరోజు ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఇతని వయసు 58 సంవత్సరాలు. ఆగస్టు 10న ఇతను జిమ్‌ చేస్తుండగా ఇతను గుండెపోటుకి గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.మొదట వైద్యులు రెండు సార్లు సీపీఆర్ చేసి పర్వాలేదు అని చెప్పారట. తర్వాత పరిస్థితి మళ్ళీ విషమించడంతో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన మెదడు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందట.

అయితే అతను కోలుకుంటున్నట్లు ఇటీవల అతని సోదరుడు డిపో శ్రీవాస్తవ కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోనే ఇలా జరిగినట్లు తెలుస్తుంది. రాజు శ్రీవాస్తవ అనేక స్టాండప్ కామెడీ షోలతో పాపులర్ అయ్యాడు. ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’, ‘కామెడీ సర్కస్’, ‘ది కపిల్ శర్మ షో’, ‘శక్తిమాన్’ వంటి టీవీ షోస్ ద్వారా అతను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘మైనే ప్యార్ కియా’, ‘తేజాబ్’, ‘బాజీగర్’ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటనతో ఇతను ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాడు.రాజు శ్రీవాస్త‌వ మరణానికి చింతిస్తూ కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus