స్టార్‌ హీరో – హీరోయిన్‌ ప్రేమకథ తెలుసా? ఇన్నాళ్లకు చెప్పారుగా!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా – కియారా అడ్వాణీ.. ఈ ఇద్దరిలో హీరోయిన్‌ మనకు బాగా పరిచయం.. హీరో కూడా మనకు దాదాపుగా తెలుసు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కూడా తెలుసు. అయితే వారి ప్రేమ కథ గురించి పూర్తిగా తెలియదు. ప్రేమలో ఉన్నారు, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, కెమెరాల కనిపించారు, తర్వాత ప్రపోజ్‌, ఆ తర్వాత పెళ్లి అని కొట్టె కట్టె తెచ్చే అనేలా మాత్రమే తెలుసు. అయితే వారి ప్రేమ కథ గురించి ఇటీవల కియారా చెప్పింది.

భర్త సిద్ధార్థ్‌ మల్హోత్ర ప్రేమను వ్యక్తపరిచిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోను అంటూ సగటు అమ్మాయిలా కియారా అడ్వాణీ సిగ్గులొలికిస్తూ చెప్పుకొచ్చింది. సిద్ధార్థ్‌ తనను ఓ సినిమా డైలాగ్ చెప్పి మరీ ప్రపోజ్‌ చేశాడు అని చెప్పింది. వాళ్లిద్దరూ కలసి నటించిన ‘షేర్షా’ సినిమాలోని డైలాగ్‌ చెప్పి ప్రపోజ్‌ చేశాడట. ‘షేర్షా’ సినిమా తర్వాత సిద్ధార్థ్‌ తనను కుటుంబసభ్యులతో కలసి రోమ్‌ టూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ప్రపోజ్‌ చేస్తాడని అర్థమైంది అని చెప్పింది కియారా.

అయితే తనకు ప్రపోజ్‌ చేయాలనుకుంటే ముందుగా తన తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకోవాలి అని కండిషన్‌ పెట్టిందట కియారా. ఆ తర్వాత కియారా – సిద్ధార్థ్‌… క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు వెళ్లారట. ఆ తర్వాత అలా వాకింగ్‌కు వెళ్దామని సిద్ధార్థ్‌ అడగడంతో ఓకే అనిందట కియారా. ఎందుకా అనుకుంటూ ఆమె నడుస్తుండగా… ఒక్క వ్యక్తి వయోలిన్‌తో వచ్చి ప్లే చేశాడట.

అప్పుడు సిద్ధార్థ్‌ (Sidharth Malhotra) మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’ సినిమాలోని ‘దిల్లీ కా సీదా సాదా లుండా హు మే…’’ (దిల్లీ నుండి వచ్చిన ఓ సాదాసీదా అబ్బాయిని నేను అనే అర్థం వచ్చేలా) డైలాగ్‌ చెప్పి ప్రపోజ్‌ చేశాడట. ఆ ప్రపోజల్‌ చూసి నవ్వొచ్చిందట కియారాకు, ఆ తర్వాత వెంటనే ఓకే చెప్పేసిందట. ఆ మొత్తం మూమెంట్‌ను విశాల్‌ బంధువు ఒకరు వీడియో తీశారట. ఈ ఏడాది ఫిబ్రవరి 7న కియారా – సిద్ధార్థ్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సూర్యగఢ్‌ ప్యాలస్‌లో ఈ వేడుక జరిగింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus