సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు కన్నుమూత

  • April 24, 2024 / 06:52 PM IST

2024 లో ఇప్పటికే ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్, ‘దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) ,

రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే,తమిళ నటుడు అరుళ్మణి,పాప్ సింగర్ పార్క్ బొ రామ్, కన్నడ నిర్మాత, బిజినెస్మెన్ అయిన సౌందర్య జగదీష్, కమల్ హాసన్ (Kamal Haasan)  మామగారు శ్రీనివాసన్‌, రైటర్ దాసరి లలిత సాయి వంటి సినీ ప్రముఖులు మరణించారు. ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా బయటపడక మునుపే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ దర్శకుడు ‘పసి’దురై కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్ళు. వయోభారంతోనే ఆయన మరణించినట్లు స్పష్టమవుతుంది. కొడైక్కానల్ లో ఉన్న ఆయన నివాసంలోనే ‘పసి’దురై మరణించినట్లు సమాచారం. 1974 లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాలు తెరకెక్కించారు పసిదురై. కొన్నాళ్ళకి నిర్మాతగా కూడా మారి పలు హిట్లు కొట్టారు. ఎంతోమంది నటీనటులకు ఆయన లైఫ్ ఇచ్చారు.

1979 లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పసి’ సినిమా వల్ల దురై ఉన్న ఆయన పేరు ‘పసి’దురై అయ్యింది. ఇక ఆయన మృతికి చింతిస్తూ కొందరు కోలీవుడ్ నటీనటులు, ప్రేక్షకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ‘పసి’ దురై మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ వారు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus