మళ్ళీ మహేష్ వెంట పడుతున్నాడు

  • January 10, 2021 / 01:29 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గట్టిగా ట్రై చేస్తే తమిళ్ లో కూడా బాక్సాఫీస్ వసూళ్లను సాదించగలడని చెప్పవచ్చు. రాజమౌళి కూడా చాలా ఈవెంట్స్ లలో ఇదే మాట అన్నారు. ఇక ఆయనతో చేయబోయే సినిమాతో తప్పకుండా ఆ మాట నిజమవుతుందని చెప్పవచ్చు. అయితే మహేష్ తో మళ్ళీ సినిమా చేయడానికి తమిళ్ సీనియర్ డైరెక్టర్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో దేశం మెచ్చిన దర్శకుడు మురుగదాస్ స్పైడర్ సినిమా చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. అసలు ఆ సినిమా తమిళ్ కూడా హిట్ అవుతుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు డేట్స్ కోసం మురగదాస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ మహేష్ కథ ఓకే చేసినా కూడా ఇప్పట్లో ప్రాజెక్టు తెరకెక్కే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత వీలైతే స్పీడ్ గా ఒక చిన్న సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కుదరకపోతే రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఖాళీగా ఉండాల్సిందే. అంటే మహేష్ మరో మూడేళ్ళ వరకు కొత్త ప్రాజెక్టు ఒకే చేసినా సెట్స్ పైకి తీసుకురావడానికి సమయం చాలానే పడుతుంది. మరి మురగదాస్ ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus