కాస్టింగ్ కౌచ్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిన నిజం. అయితే కొంతమంది ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. అయితే నిత్యం పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యి సెలబ్రిటీలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుతూ వార్తల్లో నిలిచిన డైరెక్టర్ గీతాకృష్ణ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం నటి నీతూ చంద్ర అనే ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.

ఈమె ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం తనకి అవకాశాలు లేవని అయితే ఓ వ్యాపారవేత్త నెలకు పాతిక లక్షలు జీతం ఇస్తాను భార్యగా ఉంటావా అని అడిగారంటూ చేసిన కామెంట్స్ గురించి ప్రస్తావించారు. అలాగే సాక్షి చౌదరి గురించి కూడా ఈయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ హీరోయిన్ల గురించి గీత కృష్ణ మాట్లాడుతూ వారికి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం జరిగిందో లేదో తెలియదు కానీ ఈ విషయాలను పబ్లిక్ లో చెబుతూ వారి మార్కెట్ భారీగా పెంచుకుంటున్నారని ఈయన తెలిపారు.

ఇక వీరికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు కనుక తలెత్తి ఉంటే వాళ్ళు వ్యాపారవేత్తలు చేసిన ఆఫర్ రిజెక్ట్ చేస్తే సైలెంట్ గా ఉండాలి ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని గీతాకృష్ణ వెల్లడించారు. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఇలాంటివన్నీ సర్వసాధారణమని ఆయన కొట్టి పారేశారు.ఇకపోతే ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోయిన్ దుబాయ్ వెళుతూ ఉంటారు

వీరందరూ కూడా దుబాయ్ వెళ్లి అక్కడ బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితంలో స్థిరపడిన వారు ఉన్నారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తిరిగి ఇండియా వచ్చిన ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారని ఈయన తెలిపారు. ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీలో సర్వసాధారణమేనని ఈయన తెలిపారు.ఇలా గీత కృష్ణ హీరోయిన్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus