Nayanthara: నయనతార నిజస్వరూపం బయటపెట్టిన దర్శకుడు.. ఏం చెప్పారంటే?

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను అందుకుంటున్న నయన్ అందం, ప్రతిభ, అదృష్టం కలిసొచ్చి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. తమిళంలో నయనతారకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు హరి (Hari) నయన్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన డైరెక్షన్ లో తెరకెక్కిన అయ్యా సినిమాతో నయనతారను హీరోయిన్ గా పరిచయం చేశానని ఆయన అన్నారు.

ఆ సినిమాలో నయనతార ఇంటర్ చదివే యువతిగా నటించారని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో యాక్ట్ చేసే సమయంలో నయన్ చాలా కోపంగా ఉండేవారని ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుంది అని అనిపించేదని దర్శకుడు హరి చెప్పుకొచ్చారు. దుస్తుల విషయంలో కూడా నాతో వాదించేవారని ఆయన తెలిపారు. అయితే నయన్ కోపంలో కూడా పని బాగా జరగాలనే భావన ఉండేదని హరి కామెంట్లు చేశారు.

నయనతార నటిగా ఎదుగుతారని భావించాను కానీ మరీ ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదని హరి వెల్లడించారు. కేరళలోని గ్రామంలో పుట్టిన నయనతార ఈ స్థాయికి చేరుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. నయన్ క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న నయనతార రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కెరీర్ విషయంలో నయనతార ఆచితూచి అడుగులు వేయాలని అలా చెస్తే మరో ఐదేళ్ల పాటు ఆమె కెరీర్ కు ఢోకా ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నయనతార క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నయనతార ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలకు జోడీగా ఆమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus