Kalyan Ram: కళ్యాణ్ రామ్.. అంత గుడ్డిగా నమ్మేస్తాడా..? దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. కొంతమందిని స్వయంగా తన నిర్మాణంలోనే డైరెక్టర్స్ గా లాంచ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్లలో హిట్లు ఇచ్చిన దర్శకులు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, మల్లిడి వశిష్ట్ వంటి వారు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ అతనికి ప్లాపులు ముట్టగట్టినవాళ్ళే. ఈ లిస్ట్ లో ఎక్కువగా మల్లికార్జున్ అలియాస్ మల్లి ఉన్నాడు.కళ్యాణ్ రామ్ తో ఇతను ‘అభిమన్యు’ ‘కళ్యాణ్ రామ్ కత్తి’ ‘షేర్’ వంటి సినిమాలు తీశాడు.

ఇందులో ఒక కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కత్తి మాత్రమే కొద్దోగొప్పో ఆడింది. ఆ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించడం జరిగింది. అది కాక మల్లికార్జున్ .. శ్రీహరితో ‘భద్రాద్రి’ అనే సినిమా తీశాడు. అది కూడా సక్సెస్ కాలేదు. తాజాగా అతను ‘మధురపూడి గ్రామం అనే నేను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వస్తున్నట్టు కూడా జనాలకి తెలీదు. ఇది పక్కన పెట్టేస్తే.. ఇతని ట్రాక్ రికార్డ్ చూసి వేరే హీరోలు సినిమాలు ఛాన్స్ లు ఇవ్వడం కుదరని పని..!

కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇస్తాడు అని ఊహించడం కూడా కష్టమే. కానీ కళ్యాణ్ ఇప్పుడైనా తనతో సినిమా చేయడానికి రెడీ అంటాడట. మల్లికార్జున్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏదైనా ఓ చిన్న సినిమా అయినా తీసి హిట్టు కొట్టిన తర్వాతే కళ్యాణ్ రామ్ వద్దకి వెళ్తాను అని అతను చెబుతున్నాడు. కళ్యాణ్ రామ్ కత్తి సినిమా వల్లే తాను ఇండస్ట్రీలో ఉన్నానని, ఆ సినిమాకి లాభాలు వచ్చాయని అతని చెప్పాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus