మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగులో కూడా చాలా పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ కలిసి ఆయన చేసిన జనతా గ్యారేజ్ మూవీ ఇక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాని వల్ల.. మనమంతా, మన్యం పులి చిత్రాలు టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు బాగా చూశారు జనాలు. లూసిఫర్ చిత్రాన్ని కూడా..! ఇదిలా ఉండగా… మోహన్ లాల్ పై ప్రస్తుతం ఓ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని పై కోర్టులో వాయిదాలు కూడా నడుస్తూనే ఉన్నాయి.
ఇలాంటి టైంలో ఆయన పై ఓ రచయిత కమ్ దర్శకుడు చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే..మలయాళంలో సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాసన్ మోహన్ లాల్ పై ఘోరమైన కామెంట్లు చేశాడు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు అనే అభిప్రాయం అక్కడి జనాల్లో ఉంది. అలాంటి వ్యక్తి మోహన్ లాల్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ‘ నేను చనిపోయేలోపు మోహన్ లాల్ బండారం బయటపెడతాను.
ఆయన పచ్చి మోసగాడు. ప్రేమ్ నజీర్ ని మోహన్ లాల్ (Mohanlal) ఘోరంగా మోసగించాడు. ఆయన చెప్పిన కథ కాదని, అదే కథాంశంతో ‘సందేశం’ అనే సినిమా చేశాడు. మోహన్‌లాల్ నిశ్చితార్థానికి ముందు .. ప్రేమ్ నజీర్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని రోజులకే ఆయన మరణించారు. ప్రేమ్ నజీర్ సినిమాలో నటించాలనుకున్నట్లు మెహన్ లాల్ ఓ మీడియాతో చెప్పారు ‘ అంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాస్.
శ్రీనివాస్ కామెంట్స్ తో ప్రేమ్ నజీర్ కొడుకు కూడా పాజిటివ్ గా స్పందించారు.’మా నాన్న మోహన్ లాల్ తో సినిమా చేయాలని అనుకున్న మాట వాస్తవమే.. అయితే శ్రీనివాసన్ ఇంత స్పష్టంగా చెబుతుంటే ఆయన మాటలను కొట్టిపారేయలేము ‘ అంటూ చెప్పుకొచ్చాడు.