Fight Masters: ఫైట్ మాస్టర్స్ ఎందుకు బిక్షాటన చేశారో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

టాలీవుడ్‌లోని టాప్ యాక్షన్ కొరియోగ్రఫర్స్‌గా రామ్ – లక్ష్మణ్ కనిపిస్తారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోని స్టార్ హీరోలలో చాలా మందికి వాళ్లు ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. మనం అభిమానించే హీరోలను తెర పై చాలా పవర్ ఫుల్‌గా చూపించడానికి ఎంతో కష్టపడుతుంటారు. సౌత్‌లో ఎంతో మంది స్టార్ హీరోలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ అన్నదమ్ములు తాజాగా చేసిన ఒక పని అందర్నీ ఆకట్టుకుంటుంది. చాలామంది సెలబ్రెటీలు పాపులారీని రాగానే స్టార్‌లమని ఫీల్‌ అయిపోతూ విలువలు మర్చిపోతూ ఉంటారు.

కానీ కొందరు అలా ఉండరు. దీనికి నిదర్శనంగా ఈ ఘటనని చెప్పవచ్చు. పెద్ద సెలబ్రెటీలు అయిన రామ్ – లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. వీరు ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. . చీరాలలో ‘కోటయ్య వృద్ధాశ్రమం’లో ఉన్నవారికి ఒక ఆటో అవసరం అయ్యింది. ఆ ఆశ్రమవాసులకు ఆటో కొనిచ్చేందుకు చీరాలలోని ప్రధాన రహాదారుల్లో జోళి పట్టి బిక్షాటన చేసి ప్రజలు నుంచి నగదు సేకరించారు ఈ అన్నదమ్ములు.

ఆ వచ్చిన డబ్బుతో పాటు తమ (Fight Masters) అకౌంట్స్ నుంచి మరికొంత నగదుని కలిపి ఆ ఆశ్రమానికి అందించారు. ప్రజల్లో సేవ కార్యక్రమాల పై అవగాహన కలిపించేందుకు, అలాగే వారిని ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు రామ్ లక్ష్మణ్ జోళి పట్టి బిక్షాటన చేశారట. అనంతరం కోటయ్య వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు చేసిన పనికి నెటిజెన్లు సెల్యూట్ చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus