నువ్వేమ‌న్నా తోపు ద‌ర్శ‌కుడివి అనుకుంటున్నావా..?

కేజీఎఫ్ చిత్రంతో ఒక్క‌సారి అంద‌రి దృష్టి త‌న‌వైపు తిప్పుకునేలా చేశాడు సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను కుదిపేయ‌డంతో ప్ర‌శాంత్ నీల్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, అమ్మ సెంటిమెంట్, ఇలా అన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసి తెర‌కెక్కిన తీరు ఓ రేంజ్‌లో ఉంటుంది. దీంతో స్టార్ హీరోల క‌న్ను ఈ క్రేజీ డైరెక్ట‌ర్ పై ప‌డింది.

కేజీఎఫ్ సెకండ్ పార్ట్ తెర‌కెక్కించే బిజీలో ఉండ‌గానే టాలీవుడ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ మూవీ సెట్ అయ్యింద‌ని, ప్ర‌శాంత్ చెప్పిన సైన్స్ పిక్ష‌న్ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ స్టోరీ తార‌క్‌కు న‌చ్చింద‌ని, మిసైల్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ తెర‌కెక్క‌నుంద‌ని, ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంద‌నే టాక్ కూడా వినిపించింది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ముందుగానే ప్ర‌శాంత్‌తో అగ్రిమెంట్ చేసుకున్న ఆ ప్రోడ‌క్ష‌న్ కంపెనీ ప్ర‌శాంత్‌కు రెండు కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చింద‌ని, కేజీఎఫ్ 2 పూర్తి కాగానే ఎన్టీఆర్‌తో మూవీ సెట్స్ పైకి వెళ్ళ నుంద‌ని అప్ప‌ట్లో జోరుగా వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. టాలీవుడ్ డార్లింగ్ ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని వార్త‌లు ప‌లు మీడియాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌ను నిర్మించిన హొంబళే ప్రొడక్షన్స్ సంస్థ భారీ బ‌డ్జెట్‌లో నిర్మించనుంద‌ని స‌మాచారం. అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉన్నా దాదాపుగా ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ కాంబో ఫిక్స్ అయిపోయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో తార‌క్ అభిమానులు ప్ర‌శాంత్ నీల్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్‌ల నుండి సినిమా అన‌గానే అప్ప‌ట్లో ఓ రేంజ్‌లో పండుగ చేసుకున్నారు నంద‌మూరి అభిమానులు. అయితే ఇప్పుడు తార‌క్‌కు ఝ‌ల‌క్ ఇచ్చి ప్ర‌భాస్‌తో సినిమా ఓకే చేయ‌డంతో, నువ్వేమ‌న్నా తోపు ద‌ర్శ‌కుడివా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ.. ఈ క్రేజీ డైరెక్ట‌ర్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus