ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో. అదే మమ్ముట్టి (Mammootty) అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మలయాళంలో మెగాస్టార్ ఇమేజ్ ను అనుభవిస్తున్న స్టార్ ఇతను.ఈయన చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించారు. అందులో ‘స్వాతి కిరణం’ ‘యాత్ర’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ‘యాత్ర 2’ (Yatra 2) ‘ఏజెంట్’ (Agent) సినిమాల్లో కూడా నటించారు. 71 ఏళ్ళ వయసులో కూడా మమ్ముట్టి వరుసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే.
ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసిన ఘనత సంపాదించుకున్నారు మమ్ముట్టి. ఇప్పటికీ ఏడాదికి 5,6 సినిమాలు చేస్తూ నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు ‘భ్రమయుగం’ (Bramayugam) వంటి వంద కోట్ల సినిమాలు కూడా ఇస్తున్నారు. ఇటీవల మమ్ముట్టి నుండి ‘టర్బో’ ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ వంటి సినిమాలు వచ్చాయి. త్వరలో ‘బజూక’ అనే సినిమా కూడా రానుంది. ఇదిలా ఉండగా.. మమ్ముట్టి ఆరోగ్యం గురించి కొన్నాళ్లుగా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.
ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు అని, అందుకే సినిమా షూటింగ్లకి హాజరు కావడం లేదని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవి మమ్ముట్టి వరకు వెళ్లడంతో ఆయన టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘మమ్ముట్టికి క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఆయన రంజాన్ ఉపవాస దినాలు ఆచరిస్తున్నారు. త్వరలోనే షూటింగ్లకి హాజరవుతారు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మమ్ముట్టి హెల్త్ గురించి వస్తున్న గాసిప్స్ కి చెక్ పెట్టినట్లు అయ్యింది.