Anni Manchi Sakunamu: ‘అన్నీ మంచి శకునములే’ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ సంతోష్ కాదు ఎవరంటే..!

సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. ‘అల మొదలైంది’ ‘ఓ బేబీ’ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. ‘స్వప్న సినిమా’ ‘మిత్రవింద మూవీస్’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా.. బ్యానర్లపై రూపొందిన ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. (Anni Manchi Sakunamu) ‘అన్నీ మంచి శకునములే’ సినిమా పై టీం అయితే కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే సంతోష్ కెరీర్లో మంచి హిట్ అయితే ఇంకా పడలేదు. మరి ఏ ధైర్యంతో అశ్వినీదత్ కూతుర్లు అయిన స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఏ దైర్యంతో సంతోష్ ను ఈ చిత్రానికి హీరోగా ఎంపిక చేసుకున్నారు? అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే ఈ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ సంతోష్ కాదట. ఓ స్టార్ హీరో వద్దనుకోవడంతో..

సంతోష్ ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ నందినీ రెడ్డి రెడ్డి చెప్పుకొచ్చింది. ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘ఈ కథకి హీరోగా మొదట సంతోష్ నే అనుకున్నారా?’ అని యాంకర్ నందినీ రెడ్డిని ప్రశ్నించింది. దీనికి నందినీ రెడ్డి సమాధానమిస్తూ.. ‘ఈ కథకి మొదట విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నాను. అది మూడు 3,4 ఏళ్ళ క్రితం. కానీ ఆ తర్వాత విజయ్ ఇమేజ్ మారిపోయింది.

కాబట్టి.. ఇలాంటి కథ అతనికి కరెక్ట్ కాదని నేను భావించాను. ఈలోగా ‘ఓ బేబీ’ కంప్లీట్ చేశాను. తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ టైంలో స్వప్న నేను.. సంతోష్ బెటరేమో అని భావించి.. అతన్ని పిలిపించి లుక్ టెస్ట్ చేసి అతన్ని ఫైనల్ చేశాం. విజయ్ నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి.. అతనికి ఈ కథ కరెక్ట్ కాదు అని చెప్పేశాను. అతను కూడా చాలా కూల్ గా తీసుకున్నాడు. అతను చాలా మంచి వ్యక్తి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus