Dhruva: ధ్రువ సినిమాలో విలన్ క్యారక్టర్ ని వాళ్ళు చేయకపోవడమే మంచిది అంట..!

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తన్ని ఒరువన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘ధ్రువ’ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద మైల్ స్టోన్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. కమర్షియల్ గా ఈ సినిమా రామ్ చరణ్ రేంజ్ హిట్ కాకపోయినప్పటికీ, కంటెంట్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ముందు వరకు రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోర్ కొట్టిస్తున్నాడు.

ఆడియన్స్ కి బాగా దూరం అయిపోతున్నాడు అని అనుకునే వారు ట్రేడ్ పండితులు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా చేసాడో , అప్పటి నుండి రామ్ చరణ్ లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ సరికొత్త కోణాన్ని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాతనే వెంటనే ఆయనకీ ‘రంగస్థలం’ సినిమా పడింది. మధ్యలో ‘వినయ విధేయ రామ’ చిత్రం ఫ్లాప్ అయినా #RRR సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి పాన్ వరల్డ్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.

ఇది ఇలా ఉండగా (Dhruva) ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రతో సమానంగా విలన్ పాత్ర కూడా హైలైట్ అయ్యింది. తమిళ సీనియర్ హీరో ‘అరవింద్ స్వామి’ ఈ క్యారక్టర్ చేసాడు. జాలి,దయ, భయం ఇవేమి లేని క్రూరం మృగంలాగా ఆయన నటించిన తీరు అద్భుతం. ఇండియా లోనే ది బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ లో ఒకటి అని చెప్పుకోవచ్చు. అయితే హీరో తో సరిసమానమైన పాత్ర అయ్యేలోపు ఈ క్యారక్టర్ కి మన టాలీవుడ్ లో కొంతమంది సీనియర్ హీరోస్ ని సంప్రదించారట.

అందులో అక్కినేని నాగార్జున కూడా ఒకరు, ఆయనని ఈ పాత్ర కోసం అడగగా ముందు చేస్తాను అన్నాడు కానీ, ఆ తర్వాత ఎందుకో ఒప్పుకోలేదు. ఆ తర్వాత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని అడిగారు. ఆయన నటించడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ కర్ణాటక లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన్ని విలన్ గా చూపిస్తే రిస్క్ అని రామ్ చరణ్ స్వయంగా వద్దు అన్నాడు. ఇక తమిళ వెర్షన్ లో విలన్ గా చేసిన అరవింద్ స్వామినే ఈ సినిమా కోసం అడిగారు, ఆయన వెంటనే ఒప్పుకున్నాడు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus