బంగ్లాదేశ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. రిజర్వేషన్ల అంశంలో భాగంగా ఏర్పడిన వివాదం వల్ల.. బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. అంతేకాకుండా ఆయన దేశాన్ని కూడా విడిచి పారిపోయేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా.. అల్లరి మూకలు ప్రధాని నివాసంలోకి వెళ్లి.. రచ్చ చేసిన సందర్భాలు అంతా చూస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఓ యంగ్ హీరోని (Star Hero) , అతని తండ్రిని కూడా వాళ్ళు దారుణంగా కొట్టి చంపేయడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
Star Hero
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ కి చెందిన నిర్మాత సలీంఖాన్, అతని కొడుకు.. ప్రముఖ హీరో అయిన షాంటో ఖాన్..లు నివసిస్తున్న ఇంటి పై అల్లర్లు చేసే మూకలు దాడి చేశాయి. సోమవారం నాడు సాయంత్రం చాంద్పూర్ సమీపంలో ఉన్న నిర్మాత సలీంఖాన్,షాంటో ఖాన్..లు తమ నివాసం నుండి పారిపోతున్న టైంలో అల్లర్లు చేసే బ్యాచ్ తరిమి తరిమి.. తర్వాత చితక్కొట్టి చంపేశారు.
ఈ వార్త యావత్ సినీ పరిశ్రమని విషాదంలోకి నెట్టేసింది. ప్రముఖ నటుడు దేవ్ ఈ విషయంపై స్పందిస్తూ.. “సోమవారం నాడు నేను ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది. నిర్మాత సలీం,అతని కుమారుడు.. మృతి చెందారని తెలిసి షాకయ్యాను. అల్లరి మూకల వల్ల వీరు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో మళ్ళీ శాంతియుత పరిస్థితులు రావాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను’’ అంటూ సానుభూతి తెలిపాడు.