Hero: మీడియా ముఖంగా గొప్ప మాట చెప్పిన యంగ్ హీరో!

ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి అంటే అది విచిత్రంగాను, విడ్డూరంగాను చూసేవారు. అప్పట్లో హీరోయిన్లు కూడా అందుకు తొందరగా అంగీకరించేవారు కాదు. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. ఫస్ట్ లిప్ లాక్.. సన్నివేశాలు అనేవి ఇప్పుడు తెలుగు సినిమాల్లో కామన్ అయిపోయాయి. హీరోయిన్లు కూడా ఎక్కువ పారితోషికం ఇస్తామంటే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఓకే చెప్పేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం అసలు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను అంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నాడు.

అతను మరెవరో కాదు (Hero) సొహెల్. ‘బిగ్ బాస్ 4 ‘ ద్వారా ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ఓ రకంగా ఇతను ఆ సీజన్ కి ‘గేమ్ ఛేంజర్’ అని చెప్పాలి. విన్నర్ తో సమానంగా పారితోషికం పట్టుకెళ్లి.. ట్రెండింగ్ లో నిలిచాడు. అందుకే ఇతనికి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇతని లుక్స్, డ్రెస్సింగ్ కూడా బాగుంటుంది. ఇతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18 న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇతను లిప్ లాక్ సన్నివేశాలపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ తో రొమాన్స్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకి ఇతను బదులిస్తూ.. ‘రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది.. కానీ లిప్ లాక్ సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాలోనే కాదు నేను నటించే సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలకి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. మా ఇంట్లో మాటిచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus