సౌత్ సినిమాలపై బాలీవుడ్ నిత్యం ఓ స్పెషల్ ఫోకస్ పెడుతూనే ఉంది. గతంలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలను ఇతరులు రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు సౌత్ కథలపై నార్త్ స్టార్స్ మనసు పారేసుకుంటున్నారు. ముందైతే కొంతమంది హీరోలు డబ్బింగ్ రైట్స్ ను సొంతంగా కొనేసుకుంటున్నారు. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కు కూడా రోజురోజుకు డిమాండ్ ఎక్కువవుతోంది. మళయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ చేసిన పాత్రలు చాలా మంది హీరోలకు నచ్చేశాయి.
ఇక సొంత స్టైల్ లో తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి వారి పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అయితే ఈ హిట్టు సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. కండల వీరుడు జాన్ అబ్రహం అయితే ముందుగానే రైట్స్ దక్కించుకున్నాడు. ఇక అతను బిజూ మీనన్ చేసిన పోలిసాఫీసర్ పాత్రలో నటించనుండగా
పృథ్వీరాజ్ చేసిన మాజీ ఎక్స్ హావిల్దార్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నాడు. గతంలోనే ఈ స్టార్స్ ధూమ్, దోస్తానా వంటి సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక మలయాళం రీమేక్ సినిమాతో మూడవసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా బాలీవుడ్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.