ఒక్కో రూట్ లో ఒక్కో హీరో.. ఎవరి ప్లానింగ్ రైట్ అవుతుందో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు వచ్చేసింది. ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒకటి రెండేళ్లలో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. అయితే ఒకప్పుడు సినిమాలు, దర్శకుల ఎంపికలో ఒకే రూట్ ను ఫాలో అయిన స్టార్ హీరోలు ప్రస్తుతం వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారు. ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అయితే ఏ హీరో ప్లానింగ్ రైట్ అవుతుందో తెలియాలంటే ఈ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు రిలీజయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా ఫస్ట్ విడుదలవుతుందో అనే స్పష్టత మాత్రం లేదు. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆరు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మిగతా స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ లను పూర్తి చేయాల్సి ఉంది.

2024 ఎన్నికలు పూర్తయ్యే వరకు పవన్ నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రావని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తన సినీ కెరీర్ కు ప్లస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ కోసమే తారక్ ఏకంగా ఎనిమిది నెలల పాటు ఎదురుచూశారు. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని తారక్ ఫాలో అవుతున్నారు.

మహేష్ త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్ట్ లు పూర్తయ్యే వరకు మరే ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టడం లేదు. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగా రామ్ చరణ్ ఒకవైపు శంకర్ డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు మరో కొత్త ప్రాజెక్ట్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరోలలో ఎవరి రూట్ రైట్ అవుతుందో ఎవరి రూట్ రాంగ్ అవుతుందో చూడాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus