కొత్త సంవత్సరం వేడుకలు… హీరోలు ఎక్కడకు వెళ్తున్నారంటే?

మనకు కొత్త సంవత్సర వేడుకలు మహా అయితే మన టౌన్‌లో, సిటీలోనే జరుగుతాయి. అయితే సినీ జనాలకు మాత్రం కచ్చితంగా విదేశాల్లోనే ఉంటాయి. ఎలాగోలా ప్లాన్‌ చేసుకుని కొత్త సంవత్సరాన్ని విదేశీ గడ్డ మీద ఆహ్వానిస్తుంటారు మన సినిమా జనాలు. ఆ టైమ్‌కి షూటింగ్‌ లేకుండా ప్లాన్‌ చేసుకుని మరీ చూసుకుంటారు. అలా ఈసారి కూడా టాలీవుడ్‌ హీరోలు కొత్త ఏడాది కోసం విదేశాలకు వెళ్లిపోయారు. మరి ఎవరు ఎక్కడ ఉన్నారో చూద్దాం.

కొత్త ఏడాది కోసం ఎన్టీఆర్‌ (Jr NTR) ఇప్పటికే జపాన్‌ వెళ్లిపోయాడు. అక్కడ తారక్‌కు జపనీయులు అందించిన ఆహ్వానం వీడియోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికే వైరల్‌ అయ్యాయి కూడా. మొత్తం కుటుంబంతో జపాన్‌లో ఉన్నాడు. అలాగే తన బావ అల్లు అర్జున్‌ అయితే దుబాయి వెళ్లిపోయాడు. ఇప్పటికే అక్కడ న్యూ ఇయర్‌ ఏర్పాట్లు కూడా భారీగా చేసుకున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. రామ్‌చరణ్‌ అయితే ముంబయిలో ఉన్నాడని సమాచారం. ఇదిలా ఉండగా… విజయ్ దేవరకొండ అయితే షూటింగ్‌ కోసం ఇప్పటికే అమెరికా వెళ్లిపోయాడు.

కాబట్టి న్యూ ఇయర్‌ను అక్కడే ప్లాన్‌ చేశాడు. మరి కొత్త ఏడాది సమయానికి అక్కడకు రష్మిక మందన చేరుకుంటుందో… లేక వీడియో కాల్‌లో న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పుకుంటారో చూడాలి. ఇక విశాల్‌ అయితే ఇప్పటికే న్యూయార్క్‌లో సందడి చేస్తున్నాడు. మొన్నేదో ప్రాంక్‌ వీడియో కూడా చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. రెండు రోజులు ఖాళీ దొరికితేనే ట్రిప్‌లు ప్లాన్‌ వేసేస్తుంటాడు మహేష్‌. మరి వరుసగా ‘గుంటూరు కారం’ షూటింగ్‌ తర్వాత దొరికిన ఈ ఇయర్‌ ఎండ్‌ను బాగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నాట.

అందుకే దుబాయి వెళ్లిపోయాడు అంటున్నారు. పనిలో పనిగా అక్కడ ఓ యాడ్‌ షూటింగ్‌ కూడా ప్లాన్‌ చేసుకున్నాడట. పని, ఫ్యామిలీ ఒకేదగ్గర పెట్టుకుని హాలీడ్‌ను ఎంజయ్‌ చేస్తున్నాడన్నమాట. ఇక హీరోయిన్ల విషయానికొస్తే… ఇప్పటికే రష్మిక మందన, పూజా హెగ్డే, శ్రుతి హాసన్‌, సమంత, దిశా పటానీ, రకుల్‌ప్రీత్‌ సింగ్ లాంటి వాళ్లు విదేశాలకు చెక్కేశారు. అక్కడే వాళ్ల ఫెస్టివల్స్‌ అని చెప్పొచ్చు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus