బండ్ల గణేష్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కొన్నాళ్ళు మెరిశారు. అయితే సడన్ గా ‘ఆంజనేయులు’ అనే సినిమాతో నిర్మాతగా మారి అందరికీ షాకిచ్చారు. సినిమాల్లో ఒకటి, రెండు నిమిషాలు కనిపించే నటుడి స్థాయి నుండి నిర్మాతగా మారి సినిమా తీసే రేంజ్..కు బండ్ల గణేష్ ఎలా వెళ్ళాడు అనేది చాలా మందికి అర్థం కాలేదు.
అదే షాక్ అనుకుంటే.. తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మరింత షాకిచ్చాడు. నిర్మాతగా బండ్ల గణేష్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఉంది. అలాగే ‘బాద్ షా’ ‘టెంపర్’ వంటి హిట్లు ఉన్నాయి. అయితే దాదాపు 10 ఏళ్ళలో ఆయన నిర్మాణంలో రూపొందిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. అందుకు కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు.
మధ్యలో పవన్ కళ్యాణ్ తో ‘దేవర’ అనే ప్రాజెక్టు తీయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.అయితే ‘నేను ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చాను.ప్లాప్ ఇచ్చి బ్రేక్ ఇవ్వలేదు.. బ్లాక్ బస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చాను.ఇప్పుడు మొదలవుతుంది అసలైన సినిమా’ అంటూ ఇటీవల ఓ సినిమా వేడుకలో బండ్ల గణేష్ చెప్పడం జరిగింది.
అయితే బండ్ల గణేష్ ఇన్నాళ్లు నిర్మాణ రంగానికి దూరంగా ఉండటానికి కారణం.. అతని నిర్మాణంలో స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా సినిమా చేయడానికి ముందుకు రాకపోవడమే అని తెలుస్తుంది. అందుకే సీనియర్ స్టార్ హీరోలైన వెంకటేష్, చిరంజీవి.. యంగ్ హీరోలైన సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ వంటి వారిని లైన్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్