Star Heroes: ఈ స్టార్ హీరోలు హీరోయిన్లు లేకపోయినా సినిమాలు చేసేశారు..!

  • July 30, 2023 / 05:15 PM IST

స్టార్ హీరోల సినిమాలు అనేసరికి అభిమానులకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు చేసే సినిమాలు ఎలాంటి కథలు, ఎలాంటి జోనర్లు అయినా అయ్యుండొచ్చు. కానీ వాళ్లకి కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఒకవేళ మిస్ అయితే పరిస్థితి ఏంటి? ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకి జోడీగా స్టార్ హీరోయిన్లు ఉండాలి. వాళ్ళతో లవ్ ట్రాక్ ఉండాలి. డ్యూయెట్ లు అవి చాలా కాస్ట్ లీ గా చిత్రీకరించాలి.

అయితే కొంతమంది స్టార్ హీరోలు (Star Heroes) హీరోయిన్లు లేకపోయినా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ హీరోలు ఎవరో తెలుసా? ఎస్ వాళ్ళే..కమల్ హాసన్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ .కమల్ హాసన్ – వెంకటేష్ కలిసి నటించిన ‘ఈనాడు’ సినిమాలో ఇద్దరికీ జోడీగా ఏ హీరోయిన్ నటించలేదు. అలాగే వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ సినిమాలో చాలా మంది హీరోయిన్లు ఉంటారు కానీ వెంకీకి జోడీగా ఏ హీరోయిన్ నటించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ ఉండదు.

ఆ లోటు తీర్చడానికి చివర్లో త్రిషని పెట్టి కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ.. అప్పటికే అభిమానులు కంప్లీట్ గా డిజప్పాయింట్ అయ్యారు. అలాగే ‘గోపాల గోపాల ‘ సినిమాలో కూడా పవన్ సరసన హీరోయిన్ ఉండదు. ఆ సినిమా ఒరిజినల్ అయిన ‘ఓ మై గాడ్’ లో కూడా హీరోయిన్ ఉండదు.

అలాగే పవన్ లేటెస్ట్ మూవీ ‘బ్రో’ లో కూడా ఆయనకి జోడీగా ఏ హీరోయిన్ నటించలేదు. దీని ఒరిజినల్ అయిన ‘వినోదయ సీతమ్’ లో కూడా ఆయన పాత్రకి హీరోయిన్ ఉండదు. అలాగే తమిళంలో చూసుకుంటే అజిత్ కూడా ఇలాంటి రిస్క్ లు చేస్తుంటాడు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus