Sukumar: ప్లాన్‌ చేశాం అంటున్న నిర్మాతలు.. కానీ సుకుమార్‌ రిలీజ్‌ ప్లాన్స్‌ వేరేలా ఉన్నాయట!

కొన్ని రోజుల క్రితం ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2)  సినిమా మన వెబ్‌సైట్‌లో ఓ వార్త మీరు చదివి ఉంటారు. ఈసారి కూడా ప్లానింగ్‌ సరిగ్గా కుదిరేలా లేదని, సినిమా ప్రచారంలో దర్శకుడు సుకుమార్‌ (Sukumar)  కనిపించరు అని ఆ వార్త సారాంశం. ఆ టైమ్‌లో ఇది డౌట్‌గా మాత్రమే ఉంది. ఆ తర్వాత కొన్ని క్లారిటీలు వచ్చినా.. ఇప్పుడు మళ్లీ అదే డౌట్‌ కూడా వచ్చింది. ఇప్పటికే సినిమా విషయంలో కొత్త పుకార్లు వినిపిస్తుండగా.. మళ్లీ ఈ పాత పుకారు రావడం ఇబ్బందికరంగా మారింది.

Sukumar

పైన చెప్పినట్లు మరోసారి ‘పుష్ప 2’ సినిమా ప్రచారంలో దర్శకుడు సుకుమార్‌ మరోసారి కనిపించే అవకాశం లేదు అని అంటున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం, ఇటీవల సినిమా నిర్మాతలు చెప్పి దాని ప్రకారం అనుకున్న సమయానికి ఫైనల్‌ కాపీ సిద్ధమవ్వదు అని చెబుతున్నారు. మొన్నీమధ్య సినిమా ప్రీపోన్‌ చేస్తున్న విషయాన్ని చెప్పడానికి నిర్మాతలు, పంపిణీదారులు ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. అప్పుడు కూడా నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా సినిమా కాపీ ముందే రెడీ అవుతుంది అని చెప్పారు.

కానీ.. ఇప్పుడు లెక్క చూస్తుంటే సినిమాకు మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్‌ ఉంది అంటున్నారు. ఇక సినిమా రీరికార్డింగ్‌ పనులు ఇప్పుడే మొదలయ్యాయి అని చెబుతున్నారు. వీటన్నింటిని పూర్తి చేయడానికి గట్టిగా నెల కూడా లేదు. దీనికి తోడు సుకుమార్‌ ఆఖరి క్షణం వరకు సినిమాను షైన్‌ చేస్తూనే ఉంటారు. కాబట్టి ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) తరహాలోనే ఆఖరి వరకు ఎడిట్‌ రూమ్‌లో కూర్చోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ట్రైలర్‌ పనుల్లోనే బిజీగా ఉన్నారట.

ఈ లెక్కన మరోసారి సుకుమార్‌ను రిలీజ్‌కు ముందు రోజు ముంబయి నుండి హైదరాబాద్‌కి ప్రెస్‌ మీట్‌ పెడతారు అని అంచనాకు వచ్చేస్తున్నారు ఫ్యాన్స్‌. మరి ఈ అంచనాలను తలకిందులు చేసి ముందుగానే సినిమా పూర్తి చేసి ప్రచారానికి లెక్కల మాస్టారు వస్తారేమో చూడాలి.

‘శ్రీదేవి సోడా సెంటర్‌’.. ఫలితంపై స్పందించిన దర్శకుడు… ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus