సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. ఇప్పటికే ఎస్.కె.ఎన్ తండ్రి (Sreenivasa Kumar Naidu) , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) , రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే,తమిళ నటుడు అరుళ్మణి.. వంటి వారు మృతి చెందారు.
ఈ షాక్..ల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో సింగర్ మరణించడం పెద్ద షాకిచ్చినట్టైంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ బొ రామ్ మృతి చెందింది. ఆమె వయసు కేవలం 30 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. చిన్న వయసులోనే పార్క్ బొ రామ్ మరణించడంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.
పార్క్ బొ రామ్ మరణించడానికి కొద్ది గంటల ముందు ఆమె ఓ ఈవెంట్‌కు హాజరైందట. ఆ టైంలో ఆమె ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు అంతా చెబుతున్నారు. ఆ తర్వాత రాత్రి 9.55 గంటలకు రెస్ట్ రూంకు వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాలేదట. ఈ క్రమంలో ఆమె స్నేహితులు వెళ్లి చూడగా సింక్‌పై శవమై పడి ఉందని వారు చెప్పుకొచ్చారు.